సోషల్ మీడియాకు భయపడుతున్న బిగ్ బాస్..అసలు ఏమి జరుగుతుంది?

గత మూడు సీజన్స్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ 4 ఏమంత ఆదరణ దక్కించుకోవడం లేదు. ఈ షోకి వస్తున్న టీఆర్పీనే ఇందుకు నిదర్శనం. శని, ఆదివారాలలో షో రేటింగ్ కొంచెం ఆశాజనకంగా ఉంటున్నప్పటికీ వీక్ డేస్ లో సింగిల్ డిజిట్ టీఆర్పీ మాత్రమే తెచ్చుకుంటుందట. కార్తీక దీపం లాంటి సీరియల్స్ టీఆర్పీ దరిదాపుల్లో కూడా బిగ్ బాస్ షో లేదని సమాచారం. అంతగా ఫేమ్ లేని కంటెస్టెంట్స్ మరియు షో పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం దీనికి కారణం అని చెప్పొచ్చు.

ముఖ్యంగా బిగ్ బాస్ లో జరిగిన కొన్ని ఎలిమినేషన్స్ పై ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేశారు. టీవీ నైన్ రిపోర్టర్ నాగవల్లి, కుమార్ సాయి మరియు దివి ఎలిమినేషన్ రాంగ్ అనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. ఓట్ల ఆధారంగా కాకుండా బిగ్ బాస్ నిర్వహకులు తమకు ఇష్టం వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తున్నారని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం సాగుతుంది.

దీనితో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఓట్లు వేసే వారి సంఖ్య కూడా తగ్గిపోయిందని కొందరు అంటున్నారు. నిన్న నాగార్జున బిగ్ బాస్ వేదికపై నుండి సోషల్ మీడియా ప్రచారాలు నమ్మొద్దు, కేవలం మీ ఓట్ల ప్రాతిపదికన మాత్రమే ఎలిమినేషన్ జరుగుతుందని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో జరుగుతున్న నెగిటివ్ ప్రచారం షో రేటింగ్ పై తీవ్ర ప్రభావం చూపడం వలన, బిగ్ బాస్ నిర్వాహకులు దీనిని ఎలా అరికట్టాలని భావిస్తున్నారట.

Exit mobile version