సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్న నయనతార


నయనతార తన రాబోయే చిత్రం కోసం తన సొంత గాత్రంతో డబ్బింగ్ చెప్పుకోనున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కృష్ణం వందే జగద్గురుమ్” చిత్రం కోసం నయనతార తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనున్నారు. ఈ విషయమై క్రిష్ ప్రత్యేకంగా నయనతారని కోరినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో నయనతార డ్యాకుమెంటరి చిత్రాలను చిత్రీకరించే ఫిలిం మేకర్ గా కనిపించనుంది. ఈ చిత్రంలో రానా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ చాలా వరకు పూర్తయ్యింది. ఈ మధ్యనే క్రిష్ ఈ చిత్రాన్ని తమిళంలో కూడా తెరకెక్కించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వి ఎస్ జ్ఞానశేకర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా స్వరబ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది నయనతార నటించిన “శ్రీరామరాజ్యం” చిత్రంలో తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది, అదే తన చివరి చిత్రం అని అందరు భావించారు. కానీ తను అటు తమిళంలో మరియు ఇటు తెలుగులో భారి చిత్రాలలో నటిస్తూ తిరిగి తెరమీద కనువిందు చెయ్యనున్నారు. “కృష్ణం వందే జగద్గురుమ్” చిత్రం కాకుండా నాగార్జునతో కలిసి “లవ్ స్టొరీ” మరియు గోపీచంద్ తో కలిసి “జగన్ మోహన్ IPS” చిత్రాల్లో నటిస్తోంది, అలాగే తమిళంలో అజిత్ సరసన ఒక చిత్రాన్ని చేస్తున్నారు.

Exit mobile version