ఫైనల్ మిక్స్ పూర్తి చేసుకున్న “నాయక్” ఆడియో

ఫైనల్ మిక్స్ పూర్తి చేసుకున్న “నాయక్” ఆడియో

Published on Nov 29, 2012 4:03 AM IST

రామ్ చరణ్, కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో రానున్న “నాయక్” చిత్రం జనవరిలో విడుదలకు సిద్దమయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 14న శిల్పకళా వేదిక నందు జరగనుంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఈ రోజు పాటల ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేశారు. ఈ ఆల్బం ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని తమన్ ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. “నాయక్” చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు