ఇటీవలే ‘సోలో’ సినిమాతో హిట్ కొట్టిన నారా రోహిత్ తన తర్వాత సినిమాకి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. కానీ ప్రస్తుతం నాని వరుసగా సినిమాలు ఒప్పుకొంటూ తన సినిమాల మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఎస్.ఎం.ఎస్’ సినిమాలు తీసిన తాతినేని సత్యతో ఓ సినిమా చేయడానికి నారా రోహిత్ అంగీకారం తెలిపాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా స్క్రిప్ట్ మరియు తన పాత్ర నచ్చడంతో నారా రోహిత్ ఈ ప్రాజెక్ట్ కి పచ్చ జెండా ఊపారు.
ప్రస్తుతం నారా రోహిత్ విజయ్ కృష్ణ డైరెక్షన్లో ‘మద్రాసి’ సినిమాలో నటిస్తున్నారు, ఇది కాకుండా శ్రీనివాస్ రాగ డైరెక్షన్లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఒక్కడినే’ సినిమాతో డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది.