‘శ్యామ్ సింగ రాయ్’ కోసం నారా రోహిత్ ?

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ‘శ్యామ్ సింగ రాయ్’ క్లైమాక్స్ లో వచ్చే ఓ గెస్ట్ రోల్ లో మరో హీరో కనిపించబోతున్నాడు. నారా రోహిత్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. సినిమాకే ఎంతో కీలకమైన ఈ రోల్ లో రోహిత్ అయితేనే బాగుంటుందని చిత్రబృందం నారా రోహిత్ ను అప్రోచ్ అయింది. ఇక గతంలో కూడా రోహిత్ పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఎక్కువ భాగం నడుస్తోందని.. ముఖ్యంగా నాని రోల్ కి సంబంధించిన కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాల బాగుంటాయని… అందుకే నాని ఈ సినిమా పై బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి నాని 27వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో నానిని మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నారట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా.

Exit mobile version