డి ఫర్ దోపిడి కి నాని వాయస్ ఓవర్

డి ఫర్ దోపిడి కి నాని వాయస్ ఓవర్

Published on Sep 21, 2013 3:00 PM IST

Nani
బాలీవుడ్ దర్శకద్వయం రాజ్ మరియు కృష్ణ నిర్మిస్తున్న ‘డి ఫర్ దోపిడీ’ సినిమాలో వరుణ్ సందేశ్ మరియు సందీప్ కిషన్ నటిస్తున్నారు. రాక మరియు క్రిష్ దగ్గర పని చేసిన సిరాజ్ కల్లా తొలిసారిగా మెగాఫోన్ పట్టనున్నాడు

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు నాని వాయిస్ ఓవర్ ను అందించాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల చివర్లో విడుదల చేద్దాం అని అనుకుంటున్నారు. సచిన్ – జిగర్ మరియు మహేశ్ శంకర్ సంగీతాన్ని అందించారు

గతంలో మిస్ ఇండియా అమెరికాగా ఎంపికైనా ఎన్.ఆర్.ఐ మేలనీ కన్నోకడ హీరోయిన్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాల్సి వుంది.

తాజా వార్తలు