చివరి దశకు చేరుకున్న నాని – కృష్ణ వంశీ మూవీ


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ మరియు నాని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఇప్పటి వరకూ 80% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘పైసా’ అనేది వర్కింగ్ టైటిల్. ఇంకో 20 -25 రోజుల్లో ఈ చిత్ర చిత్రీకరణ పూర్తి చెయ్యాలనే దిశగా చిత్రీకరణ జరుగుతోంది. మలయాళీ భామ కాథెరిన్ థెరీస ఈ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నారు. చాలా సింపుల్ గా స్టార్ట్ చేసి సైలెంట్ గా చిత్రీకరణ పూర్తి చేస్తున్న కృష్ణ వంశీ ఈ చిత్రంతో బాక్స్ ఆఫీసు దగ్గర హిట్ కొట్టాలని చూస్తున్నారు. రాజకీయ అంశాలు కలగలిపిన ఈ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. చరణ్ రాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు.

Exit mobile version