విజయ్ “కింగ్డమ్”ని డామినేట్ చేసిన నాని “హిట్ 3”

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో టైర్ 2 టాప్ స్టార్స్ నాచురల్ స్టార్ నాని అలాగే విజయ్ దేవరకొండలు కూడా ఒకరు. వీరిద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు ఇద్దరు హీరోస్ సాలిడ్ మార్కెట్ ని పాన్ ఇండియా లెవెల్లో సెట్ చేసుకోగా వీరి నుంచి నెక్స్ట్ రానున్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరి విజయ్ హీరోగా నాని “జెర్సీ” దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో “కింగ్డమ్” అనే భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్లోనే మోస్ట్ హైప్ ఉన్న సినిమాగా ఇది నిలిచింది. అయితే దీనిపై మేకర్స్ రీసెంట్ గానే టీజర్ ని రిలీజ్ చేయగా దీనికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే లేటెస్ట్ గా నాని బర్త్ డే కానుకగా తాను పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలనుతో చేసిన చిత్రం “హిట్ 3” నుంచి వచ్చిన టీజర్ మాత్రం కింగ్డమ్ ని ఈజీగా డామినేట్ చేసేసింది అని చెప్పాలి. ఇప్పుడు వరకు విజయ్ కింగ్డమ్ టీజర్ కి 15 మిలియన్ వ్యూస్ వస్తే కేవలం 18 గంటల్లోనే హిట్ 3 టీజర్ 16 మిలియన్ వ్యూస్ రాబట్టి అదరగొట్టింది. దీనితో సర్కార్ మేనియా గట్టిగానే ఉండేలా ఉందని చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో వచ్చాక ఎలాంటి వండర్స్ చేస్తాయో వేచి చూడాలి మరి.

Exit mobile version