గౌతం మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ చిత్రం చివరి షెడ్యూల్ చిత్రీకరణ త్వరలోనే చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నాని మరియు సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సమంత అనారోగ్యం కారణంగా ఈ చిత్ర షెడ్యూల్ ఆగిపోయింది. ప్రస్తుతం సమంత తిరిగి మళ్ళీ షూటింగ్ లలో పాల్గొంటోంది. గౌతం మీనన్ తొందరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం నాని సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న’జెండా పై కపిరాజు’ చిత్రం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. ‘ త్వరలోనే ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రీకరణలో పాల్గోనబోతున్నానానని’ నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటివరకు విడుదలైన ఈ చిత్ర రెండు టీజర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో నాని మరియు సమంత మధ్య రొమాంటిక్ ట్రాక్ చాలా బాగుంటుందని మరియు వీళ్ళిద్దరూ ఈ చిత్రంలో పలు అవతారాల్లో కనిపించనున్నారని ఈ చిత్ర టీం చెబుతోంది. గౌతం మీనన్ ప్రేమకథా చిత్రాలు తీయడంలో తనకంటూ ఒక ప్రేత్యేక ముద్ర వేసుకున్నారు , ఆయన అన్ని చిత్రాలలానే ఈ చిత్రం కూడా విజయం సాదిస్తుందని భావిస్తున్నారు. అనుకున్నట్లుగా ఈ చిత్ర చిత్రీకరణ జరిగితే ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ లో విడుదల చేసి, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.