డీ ఫర్ దోపిడీతో నిర్మాతగా మారనున్న నాని

డీ ఫర్ దోపిడీతో నిర్మాతగా మారనున్న నాని

Published on Sep 23, 2013 8:11 PM IST

nani-as-producer
యంగ్ హీరో నాని ప్రస్తుతం వరుసగా పెద్ద పెద్ద ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. నాని తాజాగా హీరో నుంచి నిర్మాత అవతారం ఎత్తాడు. కానీ అతను ఇంకా ప్రొడక్షన్ హౌస్ లాంటిది ఏదీ స్టార్ట్ చెయ్యలేదు.

తాజా సమాచారం ప్రకారం ‘డీ ఫర్ దోపిడీ’ సినిమాలో 50% అమౌంట్ పెట్టి నిర్మాతగా సగం వాటా కొట్టేసాడు. వరుణ్ సందేశ్ – సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ద్వారా సిరాజ్ కల్ల డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. అలాగే ఈ సినిమాకి నాని వాయిస్ ఓవర్ కూడా అందిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం చూసిన నానికి మూవీ బాగా నచ్చడంతో ఈ సినిమా నిర్మాతలైన రాజ్ – డికె లతో పాటు తను కూడా ఓ నిర్మాతగా జాయిన్ అయ్యాడు.

మెలనీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మహేష్ శంకర్, సచిన్ – జిగర్ లు సంగీతం అందించారు. సెప్టెంబర్ 27న ఆడియో రిలీజ్ చేయనున్న ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు