కింగ్ అక్కినేని నాగార్జున ‘డమరుకం’ సినిమాతో దసరా బరిలో దిగటానికి కూడా సమాయత్తమవుతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు, అంటే ఈ సినిమా నవరాత్రులు మొదలయ్యే సమయంలో విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో విడుదల సెప్టెంబర్ 10న జరగనుంది.
సోషియో ఫాంటసీ నేపధ్యంలో, సుమారు 36 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇది నాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. యోగా బ్యూటీ అనుష్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 27 నుండి ఈ చిత్రంలోని చివరి పాటను చిత్రీకరించనున్నారు, ఆ పాటతో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తవుతుంది.