డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్, సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించుకున్న శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ’22’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టీజర్ ను 2ఫిబ్రవరి 2020న ఉదయం 8:59 నిమిషాలకు కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి ముఖ్య అతిథిగా పాల్గొని 22 మూవీ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత కొండా కృష్ణం రాజు పాల్గొన్నారు.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “అందరికి ఎంతో ఇష్టమైన బి.ఎ.రాజు గారి, జయగారి అబ్బాయి శివ. జయగారు అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి చాలా ఇష్టం. వాళ్ళిద్దరితో నేను బాగా క్లోజ్ గా ఉంటాను. జయగారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ అవుతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆమె అందరికి బాగా తెలిసిన మహిళా దర్శకురాలు. శివ దర్శకుడిగా జయగారి పేరు నిలబెట్టాలి. అలాగే బి.ఎ.రాజు గారిది కూడా. రూపేష్ వెల్ కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ. బయట ఎన్నో సక్సెస్ ఫుల్ బిజినెస్ లు ఉన్నా సినిమా అంటే ఫ్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాడు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. ఇప్పుడే టీజర్ చూశాను. ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టైటిల్ 22. టీజర్ విడుదలయింది 2-2-2020. అన్ని రెండులే ఉన్నాయి. న్యూమరాలజి ప్రకారం నాది కూడా రెండు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్” అన్నారు.
సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – శివ దర్శకుడు కావడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ కాపీ కూడా వారం రోజుల్లో రెడీ అవుతుందని చెప్పాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా వద్దకు వచ్చి ఓ సినిమా ప్రొస్ట్ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేశాడు. రాజుగారు ఎలా ఒక సినిమా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకొని కష్టపడి ప్రమోషన్ చేస్తారో… అలా శివ కూడా చాలా కష్టపడతాడు. దర్శకుడుగా సక్సెస్ కావడానికి ఈ సినిమాతో ఒక మంచి ప్రయత్నం చేశాడు. కొత్తగా దర్శకులు కావాలనుకునేవారు తొలుత ప్రేమకథను తీయాలనుకుంటారు. కానీ శివ విభిన్నంగా ఆలోచించి ఓ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను తీసుకుని ఇంత బాగా తీశాడంటే అతని మెచ్యూరిటీ లెవల్ ఏంటో తెలుస్తోంది. ఈ సినిమాను ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలనుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్‌దిబెస్ట్ అన్నారు. హీరో రూపేష్‌కుమార్ చౌదరి మాట్లాడుతూ – మా అయి ఈ ప్రొడక్షన్ బ్యానర్ లొగొ లాంచ్ కార్యక్రమానికి మారుతిగారు వచ్చి వారి ఆశీస్సులు అందించారు. మళ్లీ ఈ సినిమా క్యాలెండర్ లాంచ్ చేసినందుకు మారుతిగారికి థ్యాంక్స్. నాగార్జునగారిచేతుల మీదుగా మా సినిమా టీజర్ లాంచ్ అవడం నెక్ట్స్ లెవల్ ఆనందంగా ఉంది అన్నారు.
చిత్ర దర్శకుడు శివకుమార్ బి.మాట్లాడుతూ – నాగార్జున టీజర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కొత్త దర్శకులను ప్రొత్సహించే నాగార్జునగారి చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంటైర్ 22టీమ్ తరఫున నాగార్జునగారికి థ్యాంక్స్. మారుతిగారు ఇటీవల ప్రతిరోజూపండగే సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఆ పండగను ఈ పండగకి తీసుకువచ్చారు. మా 22లో ఆ పండగ జరుగుతుంది. ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు అందరికీ థ్యాంక్స్. కొండాకృష్ణంరాజుగారికి, మారుతిగారికి స్పెషల్ థ్యాంక్స్. ఆడియో విషయంలో ఆదిత్యమ్యూజిక్ మాధవ్‌గారు, నిరంజన్‌గారు చాలా సపోర్ట్ చేశారు. కమర్షియల్‌గాకూడా ప్రొత్సహిస్తున్నారు. ఇప్పుడు ఈ టీజర్‌లాంచ్‌కి కూడా వారి సహకారం అందించారు. కథ ప్రకారమే 22 అనే టైటిల్ పెట్టాం. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు. నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ – ఎంతోమంది కొత్త దర్శకులను ప్రొత్సహించి, వారు ఈ రోజు మంచి స్థాయిలో ఉండటానికి కారణమైన నాగార్జున చేతులు మీదుగా టీజర్‌ను లాంచ్ చేయించాలని వారిని కలిశాను. మా అబ్బాయి..శి వ ఓ సినిమాను డైరెక్ట్ చేశాడు.. అని చెబుతుండగానే నాగార్జునగారు కల్పించుకుని తప్పక లాంచ్ చేస్తానన్నారు.