బైక్ రేసింగ్ అంటే ఇష్టం అంటున్న నాగార్జున

బైక్ రేసింగ్ అంటే ఇష్టం అంటున్న నాగార్జున

Published on Nov 25, 2012 1:28 AM IST


నాగార్జున చిత్రాలలోనే కాకుండా పలు అంశాలలో ఈయన సిద్ద హస్తుడు అని చెప్పాలి అందులోని బైక్ రేసింగ్ అంటే ఈయనకి ఉన్న ఇష్టం ఎంతంటే ఎఫ్ ఐ ఎం ఛాంపియన్షిప్ లో ఇండియా తరుపున ఒక టీం ధోని మరియు నందిష్ తో కలిసి ప్రారంభించారు. బైక్ మీద తనకున్న వ్యామోహం గురించి హైదరాబాద్ టాబ్లాయిడ్ కి చెప్తూ నాగార్జున ఇలా అన్నారు “రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టం టివి లో మోటార్ రేస్ లను ఫాలో అవుతూ ఉంటార్ను వాటిని నేరుగా చూడటానికి యూరప్ కి కూడా వెళ్తూ ఉంటాను” అని అన్నారు. యు ఎస్ చదివేప్పుడు అయన దగ్గర సుజుకి GS750 సూపర్ బైక్ ఉండేది ఇప్పుడు కూడా అయన వద్ద యమహా 1000సిసి, హోండా సిబిఆర్ 1000సిసి, కవాసకి 1000సి సి నింజా బైక్ లు ఉన్నాయి అంటే అయన బైక్ రేసింగ్ ఎంత ఇష్టపడతారో అర్ధం అయిపోతుంది. ఇదే అయన కొడుకు హీరో నాగ చైతన్య మీద కూడా ప్రభావం చూపినట్టుంది.

తాజా వార్తలు