రాయలసీమలో అశ్వథామ హల్ చల్ చేస్తాడట.

యంగ్ హీరో నాగ శౌర్య అశ్వథామ చిత్రంతో వచ్చిన విజయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. చిత్రానికి వారు అందిస్తున్న ఆదరణకు స్వయంగా వారిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పటికే నాగ శౌర్య ఏలూరు, విజయవాడ, భీమవరం, వైజాగ్ వంటి ప్రాంతాలలో అశ్వథామ ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్స్ సందర్శించారు. ఇక నేడు రాయలసీమలో ఆయన విజయోత్సవ యాత్ర కొనసాగనుంది. రాయలసీమలోని కర్నూల్, కడప, అనంతపూర్, తిరుపతిలోని నాలుగు థియేటర్స్ నాగ శౌర్య సందర్శించబోతున్నాడు.

పాజిటివ్ టాక్ తో దూసుకెళుతున్న అశ్వథామ, నాగ శౌర్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికే ఈ చిత్రం 7 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. నూతన దర్శకుడు రమణ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉషా మూల్పూరి నిర్మించగా, శ్రీచరణ్ పాకల సాంగ్స్ అందించారు.

Exit mobile version