ఆ కోరిక తీరలేదంటున్న గోవా బ్యూటీ

ఆ కోరిక తీరలేదంటున్న గోవా బ్యూటీ

Published on Nov 29, 2012 6:14 PM IST


‘దేవదాసు’ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమై, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత వరుసగా టాప్ యంగ్ హీరోల సరసన నటించి పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అసలు మీరేమవ్వాలి అనుకున్నారు అని ఈ భామని అడిగితే ‘ నాకు హీరోయిన్ లేదా నటి అవ్వాలని ఎప్పుడూ లేదు. నాకు చిన్న నాటి నుంచి పుస్తకాలు చదవడం మరియు రొమాంటిక్ లవ్ స్టొరీ సినిమాలు చూడడమంటే ఇష్టం. అలాగే నాకు సింగర్ అవ్వాలనే కోరిక ఉండేది, అందుకోసమే నేను పలు పోటీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను, కానీ ఫలితం లేకుండా పోయింది. నటిగా మారిన తర్వాత ఖాళీ లేకపోవడంతో ఆ కోరిక అలానే ఉండిపోయిందని’ అన్నారు. ప్రస్తుతం ఇలియానా హిందీలో షాహిద్ కపూర్ తో చేస్తున్న ఒక్క సినిమా తప్ప తెలుగులో సినిమాలేమీ చేయడం లేదు. ఈ వార్త విన్న వారెవరైనా ఇలాయనాకి సింగర్ గా చాన్స్ ఇచ్చి తన కోరిక తీరుస్తారేమో చూడాలి.

తాజా వార్తలు