నేను చాలా త్వరగా నిర్ణయాలను తీసుకుంటా : తాప్సీ

నేను చాలా త్వరగా నిర్ణయాలను తీసుకుంటా : తాప్సీ

Published on Sep 17, 2013 11:30 PM IST

Taapsee

తన గురించి మిగిలిన వారు ఏమనుకున్నా లెక్కచెయ్యకుండా తనకి నచ్చినట్టు జీవించి, నచ్చినట్టే మాట్లాడే హీరోయిన్ తాప్సీ.తాను ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలిపింది. “నేను ఒకసారి తీసుకున్న నిర్ణయాల గురించి ఆలోచించను. ప్రస్తుతం నేను చేస్తున్న పనిపై శ్రద్ధ పెడతాను. ఇప్పటి నా నిర్ణయం భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకే దారి తీస్తుందా అని ఆలోచించే అమ్మాయిని కాను” అని తెలిపింది

ఒక సినిమాను ఆమె అంగీకరించాలి అంటే ఆమెకు కధ ఆసక్తికరంగా అనిపిస్తే చాలట. మిగిలిన అంశాల గురించి ఎక్కువగా పట్టించుకోకుండానే సినిమాను అంగీకరిస్తుందట. ప్రస్తుతం ఈ లారెన్స్ ‘ముని 3’, మరియు అజిత్ ‘ఆరంబం’ సినిమాలతో బిజీగా వుంది.

తాజా వార్తలు