అభివృద్ధి చెందుతున్న పరిజ్ఞానంతో మన సంప్రదాయాల్ని అన్ని మరుగున పడిపోతున్నాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహించాల్సిన భాద్యత మన అందరి పై ఉందని ‘మ్యూజిక్ మ్యాజిక్’ మూవీ నిర్మాత కాంత్ రెడ్డి అంటున్నారు. ఐటి రంగం నుండి సినీ నిర్మాణ రంగం వైపు అడుగులేసిన శ్రీ కాంత్ రెడ్డి ని ఈ సినిమా ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారు అని అడిగితే ‘ రెండు రకాల సంగీతాలని మేళవించడమే ఈ చిత్రంలో మేము చేసిన మ్యాజిక్.
రాక్ సంగీతానికి మనదైన శాస్త్రీయ సంగీతాన్ని కలిపి ఈ కథని తయారు చేసాం. తెలుగు సినిమాలో రాక్ సంగీతాన్ని చూపించడం ఇదే తొలిసారి.
ఈ సినిమాలోని కొత్తదనం అందరికీ నచ్చుతుందని’ ఆశిస్తున్నాను. మంత్రాక్షర్ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమా ద్వారా నూతన నటీనటులు పరిచయమవుతున్నారు.