ట్రైలర్ తర్వాత ‘మాస్ జాతర’పై మరింత హైప్!

ట్రైలర్ తర్వాత ‘మాస్ జాతర’పై మరింత హైప్!

Published on Oct 28, 2025 7:03 AM IST

Mass Jathara

మాస్ మహారాజ రవితేజ హీరోగా హీరోయిన్ గా శ్రీ లీల నటించిన చిత్రమే “మాస్ జాతర”. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ బాగా ఆలస్యం అవుతూ వచ్చినప్పటికీ లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే విధంగా ఉందని చెప్పాలి.

పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ ట్రైలర్ కనిపిస్తుండడంతో రవితేజ ఫ్యాన్స్ ఇంకా రవితేజ నుంచి ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఆ ఆడియెన్స్ లో కూడా మంచి బజ్ ని జెనరేట్ చేసిన సినిమాగా ఇది నిలిచింది అని చెప్పొచ్చు.

సో మొత్తానికి మాత్రం ట్రైలర్ తర్వాత మాస్ జాతర పై మంచి హైప్ నే సెట్టయ్యింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ అక్టోబర్ 31 పైడ్ ప్రీమియర్స్ తో మొదలు కానుంది.

తాజా వార్తలు