“ఎటో వెళ్లి పోయింది మనసు” చిత్రం గురించి మాట్లాడకుండా సమంత ఉండలేకపోతున్నారు. గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళం లో నిర్మితమవుతుంది. తెలుగులో నాని కథానాయకుడిగా చేస్తుండగా తమిళంలో జీవ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇళయరాజా సంగీతం గురించి చెప్పిన సమంత ప్రస్తుతం చిత్రంలో తన పాత్ర గురించి చెప్పింది. ” జెస్సీ పాత్రకు నాకు అసలు పోలిక లేదు కాని నిత్యకి నాకు చాలా పోలికలున్నాయి. కాబట్టి తెర మీద నన్ను చూసేందుకు మీరు సిద్దమే అనుకుంటున్నా” అని అన్నారు. నిత్య ఈ చిత్రంలో సమంత పాత్ర పేరు. ఈ ప్రేమకథ చిత్రంలో సమంత మూడు విభిన్న వేషాలలో కనిపించనున్నారు. జెస్సీగా యువత గుండెల్లో నాటుకుపోయిన ఈ భామ రెండేళ్ళ తరువాత తిరిగి గౌతం మీనన్ సృష్టించిన నిత్య పాత్రతో మరోసారి తన మాయ చేసి యువత చేత “ఎటో వెళ్లిపోయింది మనసు” అనిపిస్తుందో లేదో చూడాలి.