విడుదలయిన విజయ్ “తుపాకి” ఫస్ట్ లుక్

విజయ్ మరియు కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “తుపాకి” ఫస్ట్ లుక్ ఈరోజు ఇంటర్నెట్ లో లీక్ అయ్యింది. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో ఒకేసారి నిర్మితమవుతుంది. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో విజయ్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు గా కనిపించనున్నారు చిత్రం చాలా వరకు ముంబై మరియు పూణే లలో చిత్రీకరించబడుతుంది. ఆసక్తికరంగా సంతోష్ శివన్ ఈ చిత్రానికి ఫోటో షూట్ చేపట్టారు విజయ్ అభిమానులను ఆశ్చర్య పరిచేలా ఉన్నాయి. ఈ సంవత్సరం విడుదలయిన విజయ్ చిత్రం “స్నేహితుడు” బాక్స్ ఆఫ్ఫిస్ వద్ద బోల్తా కొట్టినా “తుపాకి” చిత్రం ఆకట్టుకుంటుందని అనుకుంటున్నారు ఈ చిత్రంలో కాజల్ నటించడం ఇక్కడ విజయావకాశాలను మరింత బలపరిచాయి. విక్రం,కార్తి,సూర్య ల ల విజయ్ తెలుగు మార్కెట్ లో నిలబదగలడా లేదా అనేది చూడాలి.

Exit mobile version