లేడి ఓరియంటడ్ చిత్రం ఒప్పుకున్న స్నేహ ఉల్లాల్

స్నేహ ఉల్లాల్ మ్యూజిక్ వీడియోస్ విడుదల అయ్యాక ఆమెకి సినిమా అవకాశాలు రావటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ భామ మరో తెలుగు చిత్రాన్ని ఒప్పుకుంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు ఎవరు నిర్మిస్తున్నారు అనే విషయాలు ఇంకా వెల్లడించలేదు కాని ఈ చిత్రం ఒక లేడి ఓరియంటడ్ చిత్రమని మాత్రం చెప్పారు. చిత్రం పేరు “మైత్రి” గా ఉండచ్చు. ” తెలుగు చిత్రం ఒకటి ఒప్పుకున్నా కొత్త బ్యానర్ కొత్త వేషం ఇది కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రం మైత్రి ఈ చిత్రం పేరు నా పాత్ర పేరు కూడా ఇదే. ఈ చిత్రం లో నేను మోడర్న్ “రాణి” ” అని ట్విట్టర్ లో తెలిపారు. ప్రస్తుతం అనిల్ సుంకర దర్శకత్వంలో రాబోతున్న 3డి చిత్రం “యాక్షన్” లో ఒక పాత్రలో నటిస్తున్నారు.

Exit mobile version