“విక్కి డోనార్” రీమేక్ లో సిద్దార్థ్ నటించట్లేదు

తాజా సమాచారం ప్రకారం సిద్దార్థ్ “విక్కి డోనార్” రీమేక్ లో నటించకపోవచ్చు. గతంలో సిద్దార్థ్ ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం జాన్ అబ్రహంతో చర్చల్లో ఉన్నట్టు చెప్పాము. ఈ విషయమై ఎటువంటి నిర్ణయము తెసుకోలేదని సిద్దార్థ్ చెప్పారు. “వ్యక్తి గతమయిన చర్చలు పత్రికలకు ఎలా తెలుస్తుంది అనే విషయం తెలియట్లేదు ఈ విషయమై నేను ఒక నిర్ధారణ ఇవ్వాల్సి ఉంది అవును మేము విక్కి డోనార్ మరియు లవ్ ఫైల్యూర్ చిత్ర రీమేక్ ల కోసం ఈరోస్ వారితో చర్చల్లో ఉన్నాము కాని ఇంకా ఏది అనుకోలేదు అన్ని నిర్ణయించుకున్నాక మేము ప్రకటిస్తాము” అని చెప్పారు. ఈయన తన నిర్మాణ సంస్థ నుండి పలువురిని పరిచయం చెయ్యాలని అనుకుంటున్నారు ఇందులో కొన్ని కథా చర్చల దశలోనే ఉన్నాయి. గతంలో బాలాజీ మోహన్ దర్శకత్వంలో వచ్చిన “లవ్ ఫైల్యూర్” చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించారు. తరువాత ఈ నిర్మాణ సంస్థ నుండి పరిచయం కాబోతున్న దర్శకుడు ఎవరో చూడాలి.

Exit mobile version