మాస్ మహారాజ రవి తేజ మరియు గోవా సుందరి ఇలియానా “దేవుడు చేసిన మనుషులు ” చిత్ర చిత్రీకరణ కోసం ఇటలీ పయనమయ్యారు. ఇలియానా గోవా నుండి 18న బయలుదేరి ఇటలీ వెళ్తారు అదే రోజు రవి తేజ హైదరాబాద్ నుండి బయలుదేరుతారు. పూరి జగన్నాథ్ రవి తేజతో కలిసి వెళ్తారు. ఇటలీలో 19 నుండి మొదలు కానున్న చిత్రీకరణలో మూడు పాటలను చిత్రీకరించనున్నారు.”దేవుడు చేసిన మనుషులు” జూన్ లో విడుదలకు సిద్దమయ్యింది రఘు కుంచె సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.