రామ్ చరణ్, తమన్నా కలిసి నటించిన ‘రచ్చ’ సూపర్ హిట్ సాధించి ఇప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. దాదాపు 8 నెలలు పైగా ఈ చిత్ర షూటింగ్ జరగగా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇటీవల ఒక ప్రముఖ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్ర సక్సెస్ గురించి మాట్లాడారు. తమన్నా కార్తితో ‘అవారా’, అల్లు అర్జున్ తో ‘బద్రీనాథ్’, ఎన్టీఆర్ తో ‘ఊసరవెల్లి’, రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమాలు చేసింది. యాదృచ్చికంగా కొందరికి పెళ్ళిళ్ళు అయిపోగా, రామ్ చరణ్ కి పెళ్లి త్వరలో కానుంది. ప్రభాస్ తో ‘రెబల్’ సినిమాలో నటిస్తుండగా ప్రభాస్ కోసం కూడా పెళ్లి సంభందాలు చూస్తున్నారు. తనతో నటిస్తే పెళ్లి అయిపోతుంది అని తమన్నా సరదాగా అనగా రానాతో నటించు నీకు పెళ్ళవుతుంది అంటూ చమత్కిరించాడు. రానాతో జెనీలియా ఇటీవల ‘నా ఇష్టం’ సినిమాలో నటించగా జెనీలియాకి పెళ్లయింది. ఆ విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని రామ్ చరణ్ తమన్నా పై జోక్ వేసాడు.
Click Here For Ram Charan, Tamanna’s Interview