ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన నూతన చిత్రం “దేవుడు చేసిన మనుషులు” చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. 19 నుండి ఈ చిత్రం ఇటలీలో చిత్రీకరణ జరుపుకోనుంది. అక్కడ అందమయిన ప్రదేశాలలో ఈ చిత్ర బృందం మూడు పాటలను చిత్రీకరించనున్నారు. మాస్ మహారాజ రవితేజ రవితేజ మరియు ఇలియానా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం మీద ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. రవితేజ ఎనేర్జటిక్ నటనకి పూరి పదునయిన సంభాషణలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి అందరిలో నెలకొనింది. జూన్ మధ్యలో ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.