ఎప్పుడయితే నయనతార తరిగి చిత్రాల్లో నటిస్తానని చెప్పిందో తెలుగు మరియు తమిళంలో అవకాశాలు చాలా వచ్చాయి. ప్రస్తుతం ఈ కథానాయిక చేతిలో రానా సరసన “కృష్ణం వందే జగద్గురు” గోపిచంద్ సరసన భూపతి పాండియన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ఉన్నాయి. తమిళంలో అయితే అజిత్,విష్ణు వర్ధన్ కలయికలో రాబోతున్న చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఇటీవల ఒకానొక పత్రిక వారు నయనతార ఏక్తా కపూర్ తో చర్చల్లో ఉన్నారని తెలుగు మరియు తమిళంలో “డర్టీపిక్చర్” చిత్రంలో విద్యబాలన్ పాత్రలో కనపడనున్నారని ప్రకటించారు. ఏక్తాకపూర్ ఈ చిత్రం కోసం 2 కోట్లు ఇవ్వడానికి సిద్దపడ్డారని కూడా ప్రకటించారు.ఇదిలా ఉండగా నయన తార ఈ వార్తలన్నీ పుకార్లని తేల్చేశారు. తనకి హిందీ వెర్షన్ చిత్రం నచ్చినా అ పాత్రకి తను సరిపోదని అన్నారు. తన వద్దకు ఈ పాత్రను తీసుకొని ఎవరు రాలేదని వచ్చినా చెయ్యనని తెలిపారు. తను మాట మీద నిలబడుతుందో లేదో వేచి చూడాల్సిందే.