తెలుగు లో స్పెర్మ్ డొనేషన్ మీద చిత్రం

మధుర శ్రీధర్ వీర్య కణాల దానం మీద ఒక చిత్రం తెర మీదకు తీసుకురావటానికి సిద్దమయ్యారు ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చెబుతూ గత ఏడాది ఒకానొక ప్రముఖ పత్రిక కథనం ప్రకారమొక ఐఐటి విద్యార్ధి వీర్యం ద్వారా పిల్లల్ని కనాలని అనుకున్న దంపతుల నుండి ఈ కథ పుట్టుకొచ్చింది. విక్కి డోనార్ విడుదలకి ముందే ఈ కథను అనుకోవడం జరిగింది. ఈ చిత్రంకోసం శ్రీధర్ రెండు పేర్లను రిజిస్టర్ చేసారు “దాన కర్ణ” “దాన కర్ణుడు” అనే పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. గత ఏడాది “ఇట్స్ మై లవ్ స్టొరీ” చిత్రం తరువాత ఆయన ఈ కథ మీదే దృష్టి పెట్టారు.

Exit mobile version