ఫేస్ బుక్ లో కమల్ హాసన్

నూతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటం లో కమల్ హాసన్ ఎప్పుడు ఒకడుగు ముందే ఉంటారు. ఇంకా చిత్రాలవిషయం లో వస్తే ఈ విషయం స్పష్టమయిపోతుంది. తాజాగా మేము విన్న సమాచారం ప్రకారం కమల్ హసన్ ఫేస్ బుక్ లో ప్రవేశించబోతున్నారు. కమల్ హసన్ సన్నిహితుడు నిఖిల్ మురుగన్ కథనం ప్రకారం ” లోకనాయకుడు అయన అధికారిక ఫేస్ బుక్ ని ప్రారంభించారు మీరు ఈ పేజి నుండి సమాచారం పొందాలంటే ఫేస్ బుక్ సెర్చ్ లో maiam.mag@gmail.com సెర్చ్ చేసి మరిన్ని విశేషాలను తెలుసుకోండి” అని అన్నారు. గత కొంత కాలంగా కమల్ హాసన్ తన రాబోయే త్రిభాషా చిత్రం “విశ్వరూపం” చిత్రీకర్రణలో బిజీ గా ఉన్నారు. ఈ చిత్రం తెలుగు,తమిళం మరియు హిందీ లలో విడుదల కానుంది.ఈ చిత్రం లో అయన ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా రచన,దర్శకత్వం సహా నిర్మాణ భాద్యతలు కూడా చేపడుతున్నారు. ప్రసాద్.వి.పోట్లురి కూడా ఈ చిత్రానికి సహా నిర్మాణం అందిస్తున్నారు. కమల్ హాసన్ కాకుండా ఈ చిత్రంలో రాహుల్ బోస్, పూజ కుమార్,ఆండ్రియా మరియు శేఖర్ కపూర్ నటిస్తున్నారు. చిత్రం తీవ్రవాదం మీద ఉండబోతుంది. విశ్వరూపం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలయ్యింది. ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కానుంది.

Exit mobile version