కమల్ హాసన్ రజినీకాంత్ కలిసి నటించటం లేదు

కమల్ హాసన్ రజినీకాంత్ కలిసి నటించటం లేదు

Published on Feb 16, 2012 11:01 PM IST

కమల్ హాసన్ రజని కాంత్ తో కలిసి చెయ్యట్లేదు . ఈరోజు ఒక ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం కమల్ హాసన్ ఎప్పుడో ఆపేసిన “మరుద నాయగం” చిత్రం మళ్ళి మొదలు పెట్టినట్టు అందులో ఒక పాత్ర కోసం రజని కాంత్ ని సంప్రదించినట్టు పుకార్లు సృష్టించింది. కాని కమల హాసన్ మేనేజర్ కమల్ హాసన్ ఎటువంటి పత్రికకు ఇంటర్వ్యు ఇవ్వలేదు అని దృవీకరించారు. ఇలాంటి పుకార్లు గత పదిహేనేళ్ళుగా సాధారణం అయిపోయిందని కూడా అన్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం “విశ్వ రూపం” చిత్రాన్ని పూర్తి చెయ్యటం లో నిమగ్నమయి ఉన్నారు. దీని తరువాత ” తలైవన్ ఇర్రుకిన్డ్రాన్” చిత్రం లో చెయ్యనున్నారు ఈ చిత్రాన్ని ఆస్కార్ రవి చంద్రన్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు