నేను మహేష్ బాబు అభిమానిని – లింగు స్వామి

మహేష్ బాబు అభిమానుల్లో ఇంకొక ప్రతేక వ్యక్తి చేరారు. ప్రముఖ తమిళ దర్శకుడు లింగు స్వామి మహేష్ బాబుకి వీరాభిమాని అని తెలిపారు. ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన విలేఖర్ల సమావేశంలో లింగు స్వామి మాట్లాడుతూ “మహేష్ బాబుని కొన్ని సార్లు కలిశాను త్వరలోనే ఆయనతో చిత్రం చేస్తానని అనుకుంటున్నాను తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించడం నా కల” అని అన్నారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం “వెట్టై” చిత్రంలో ఒకానొక పాత్ర కోసం లింగుస్వామి మహేష్ బాబు ని కలిసినట్టు చెబుతున్నారు కాని అది కుదరలేదు. ప్రస్తుతం “వెట్టై” చిత్రం తెలుగు లో “భలే తమ్ముడు” గా రాబోతుంది ఈ చిత్ర హిందీ వెర్షన్ కి లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version