తమిళంలో వరుసబెట్టి సినిమాలు చేస్తున్న హన్సిక

తమిళ ప్రేక్షకులకు హన్సిక విపరీతంగా నచ్చుతుంది. ఈమె ఇటీవలే నటించిన ఉధయనిది స్టాలిన్ సరసన నటించిన ‘ఓకే ఓకే’ చిత్రం విజయం సాధించింది. తమిళ ప్రేక్షకులు ఆమెను మరో కుష్బూ అంటూ పిలవడం మొదలు పెట్టారు. హన్సికకి తమిళ్లో చాన్సులు బాగానే వస్తున్నాయి వెట్రి మారన్ డైరెక్షన్లో శింబు సరసన ఒక సినిమా, సింగం 2, డిల్లీ బెల్లీ రీమేక్ సినిమాల్లో నటించడానికి అంగీకరించింది. ఇవే కాకుండా ‘వాలు’ అనే సినిమాలో కూడా నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ రోజు హన్సిక ట్విట్టర్లో ఈ విషయం గురించి చెబుతూ గణేష్, సంతానం ముఖ్య పాత్రల్లో నటించనున్న ప్రాజెక్ట్ అంగీకరించాను. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది.

Exit mobile version