నాగ చైతన్య-సునీల్ చిత్రంలో హన్సిక

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, కామెడి హీరో సునీల్ కలిసి ప్రధాన పత్రాలు చేస్తున్న చిత్రంలో ఒకానొక కథానాయికగా హన్సిక ఎంపిక అయ్యింది. తమిళ “వెట్టై” చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తుండగా డాలి(కిషోర్) దర్శకత్వం వహిస్తున్నారు. హన్సిక అమల పాల్ పాత్రలో కనిపించనుంది మరో కథానాయిక గురించి అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం లో సునీల్ మరియు నాగ చైతన్య అన్నదమ్ములుగా కనిపిచనున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ జూన్ 26 నుండి మొదలవనుంది.

Exit mobile version