“దమ్ము” చిత్రానికి దాసరి అభినందన

ఈరోజు ఇక్కడ పార్క్ హయత్ హోటల్ లో జరిగిన “దమ్ము” చిత్ర సక్సెస్ మీట్ లో దాసరి నారాయణ రావు చిత్రాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. దాసరి, ఎన్టీయార్, కే.ఎస్.రామారావు,చంద్ర బోస్,కార్తీక మరికొంతమంది ఈ మీట్ లో పాల్గొన్నారు. ఈ చిత్ర విజయం గురించి అందరు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

దాసరి ఈ చిత్రం లో ఎంతెయార్ ప్రదర్శన మరియు బోయపాటి దర్శకత్వాన్ని ఆకాశానికెత్తారు “నిన్న “దమ్ము” చిత్రం చూసాను ఎన్టీయార్ ప్రదర్శనకు హాట్స్ ఆఫ్ అతను చాలా మెరుగ్గా నటించారు. అతని డైలాగ్ డెలివరి తో పోటి పడటం అసాధ్యం. బోయపాటి శ్రీను నటుల నుండి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుతున్నారు. రెండవ అర్ధ భాగం నడిపించిన తీరు అద్భుతం” అని అన్నారు.

పరిశ్రమ లో ప్రతికూల పరిస్థితుల గురించి దాసరి మాట్లాడారు “కొంతమంది కావాలనే చిత్రం గురించి ప్రతికూలంగా మాట్లాడుతున్నారు అలాంటి వారి వాళ్ళ చిత్ర పరిశ్రమ నష్టపోతుంది. ప్రతి ఒకరికి అవకాశం వస్తుంది సానుకూల ధోరణి అలవరుచుకోండి” అని అన్నారు.

Exit mobile version