బాద్షా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ‘దమ్ము’ సినిమా చేసి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత ఆయన చేయబోయే ‘బాద్షా’ మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పటికే టైటిల్ సాంగ్ రికార్డింగ్ పూర్తికాగా మిగతా పాటల కోసం ఊటీ వెళ్లారు. శ్రీను వైట్ల, తమన్, రామజోగయ్య శాస్త్రి, కోన వెంకట్, గోపి మోహన్ బృందం ప్రస్తుతం ఊటీలో మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించారు. ఈ విషయాన్నీ వారే స్వయంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇటీవలే ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం ఈ నెల 10 నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటలీలో దాదాపు 50 రోజులు షూటింగ్ చేయనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ బాబు నిర్మించనున్నారు.

Exit mobile version