బెల్లంకొండ మరియు కందిరీగ దర్శకుని మధ్య గొడవ?

పరిశ్రమలో ఉన్న తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరియు “కందిరీగ” దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ గొడవ కొట్టుకునేంత వరకు వెళ్లినట్టు తెలుస్తుంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కూడా ఈ విషయాన్నీ ప్రసారం చేసింది. ఈ విషయం గురించి ఎక్కడ దృవీకరణ లభించలేదు. బెల్లంకొండ సురేష్ మరియు సంతోష్ కలిసి హీరో రామ్ తో కొత్త చిత్రం చేస్తున్నారు. గతంలో ఈ త్రయం కలయికలో “కందిరీగ” వంటి విజయవంతమయిన చిత్రం వచ్చింది. ఈ కొత్త చిత్రం మరి కొద్ది రోజుల్లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. ‘కందిరీగ” చిత్రీకరణ సమయంలో బెల్లంకొండ సురేష్ మరియు హీరో రామ్ మధ్యలో కూడా గొడవ జరిగినట్టు వార్తలు వెలువడ్డాయి.

Exit mobile version