అల్లు శిరీష్ కొత్త మిత్సుబిషి అవుట్ ల్యాండర్ ని కొనుగోలు చేశారు ” నా మొదటి కార్ కొనుగోలు చేశాను నా సంపాదనతో కొన్న మొదటి కార్ ఇది బన్నీ కోసం వేచి చూస్తున్నాను అతనే నా మొదటి కార్ ని డ్రైవ్ చెయ్యాలి” అని శిరీష్ ట్విట్టర్ లో చెప్పారు. గతంలో అల్లు అర్జున్ బిఎండబ్ల్యు ఎక్స్6, పవన్ కళ్యాణ్ మెర్సిడెస్ జి55 మరియు చిరంజీవి రోల్స్ రాయిస్ ఫాంతం సొంతం చేసుకున్నారు. చూస్తుంటే కుటుంభం మొత్తం భారీ కార్లను సొంతం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా అల్లు శిరీష్ తన ఆరంగేట్రం కోసం సన్నధం అవుతున్నారు. తొందర్లోనే చిత్రీకరణ మొదలు కాబోతున్న ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకత్వం వహిస్తుండగా అమల పాల్ కథానాయికగా కనిపించబోతుంది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని డ్యూయెట్ మోవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.