స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గోవా బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం ‘జులాయి’ కోసం దుబాయ్ వెళ్ళిన విషయం తెలిసిందే. కొన్ని పాటల చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్ళిన చిత్ర బృందం ఈ రోజే హైదరాబాదుకి తిరిగి రానుంది. తాజా సమాచారం ప్రకారం మే 7 నుండి రామోకి ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఒక పాట చిత్రీకరించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాని ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ నెల రెండవ వారంలో ఈ చిత్ర ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.