గబ్బర్ సింగ్ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న అభిమన్యు సింగ్ ఇటీవల ఒక అనుకోని సంఘటనను ఎదుర్కొన్నారు. వేసవి సెలవుల కోసం కుటుంభ సభ్యులందరితో కలిసి మహారాష్ట్రలోని ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మతేరన్ అనే హాలిడే స్పాట్ కి వెళ్లారు. కొందరు రౌడీలు అభిమన్యు మరియు అతని కుటుంభ సభ్యుల వెంట పడి వారి కారును ఆపే ప్రయత్నం చేసి, కత్తి చూపించి వారిని దోచుకునే ప్రయత్నం చేయగా వెంటనే తేరుకుని, అక్కడే ఉండే స్థానికుల సహాయంతో వారి నుండి తప్పించుకున్నారు. హోటల్ కి చేరుకున్న వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయగా వారు సరిగా స్పందించకపోవడం విశేషం. అభిమన్యు సింగ్ రక్త చరిత్ర, నేను నా రాక్షసి, బెజవాడ వంటి చిత్రాల్లో విలన్ గా నటించాడు.