పవన్ కళ్యాణ్,శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “గబ్బర్ సింగ్” ప్రస్తుతం ఈ చిత్రంలో “దిల్ సే” పాట చిత్రీకరణ స్విట్జర్లాండ్ లో జరుపుకుంటుంది. ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రైన్ ని అద్దెకు తీసుకున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈపాట చిత్రీకరణ చిత్ర బృందం మొత్తానికి సరి కొత్త అనుభవాన్ని ఇస్తుంది అందరు చాలా ఆసక్తిగా ఈ పాట చిత్రీకరణలో పాల్గొంటున్నారు. శ్రుతి హాసన్ ఈ పాట చిత్రీకరణ గురించి మాట్లాడుతూ “స్విట్జర్లాండ్ లో ఈ ట్రైన్ ప్రయాణం చాలా అద్బుతమయిన అనుభవం రైలు లో ప్రయాణించి చాలా రోజులు అయ్యింది చిత్రీకరణను చాలా ఎంజాయ్ చేస్తున్నా” అని ట్విట్టర్ లో తెలిపారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గణేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ పూర్తవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.