‘కొత్తగా కొత్తగా’ ఆకట్టుకుంటున్న ‘మిస్ ఇండియా’ !

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మిస్ ఇండియా’. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుండి ‘కొత్తగా కొత్తగా’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. మంచి ఫీల్ తో సాగే ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తి చకాన్ని సాహిత్యాన్ని అందించారు. ఇక క్రేజు మ్యూజిక్ తో తమన్ తన ఫామ్ ను అలాగే కొనసాగించాడు. అలాగే ఈ పాటను పాడిన శ్రేయ ఘోషాల్ తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోసింది

ఇక ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదల అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కాగా మహిళల పై ఒక్కో స్టేజిలో ఒక్కో రాకంగా దాడుల జరుగుతాయి. ఆ దాడులని ఈ చిత్రంలో విశ్లేషాత్మకంగా చూపించనున్నారని సమాచారం. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న కీర్తి సురేష్.. మరి ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కూడా ప్రేక్షకుల ముంమనసును గెలుసుకుంటుందేమో చూడాలి.

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version