సెన్సార్ పనులు ముగించుకున్న తేజ సజ్జా ‘మిరాయ్’.. రన్‌టైమ్ ఎంతంటే…?

Mirai

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఫాంటసీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 49 నిమిషాలుగా మేకర్స్ లాక్ చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో మనోజ్ మాంచు, రితికా నాయక్, శ్రియా శరణ్, జగపతి బాబు, జయరాం కీలక పాత్రల్లో నటించారు. గౌరహరి సంగీతం అందిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version