తమిళ హీరో ధనుష్ ఎంచుకునే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన చేసే సినిమాలకు తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఆయన నేరుగా తెలుగులో చేసిన సినిమాలకు ఇక్కడి జనం సాలిడ్ రెస్పాన్స్ అందించారు.
సార్, కుబేర చిత్రాలతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే, ఇప్పుడు ముచ్చటగా మూడో తెలుగు చిత్రానికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు డైరెక్టర్ వేణు ఉడుగుల చెప్పిన ఓ కథ నచ్చి ధనుష్ ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడట.
నీది నాది ఒకే కథ, విరాటపర్వం సినిమాలతో వేణు ఉడుగుల మంచి గుర్తింపు సాధించారు. మరి ఇప్పుడు ధనుష్ కోసం ఆయన ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేయనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.