గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రమే “పెద్ది”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా అభిమానులు మంచి ఎగ్జైటింగ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తుండగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంట్రెస్టింగ్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.
రానున్న రోజుల్లో పాన్ ఇండియా మార్కెట్ లోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో పలు సినిమాలు మన తెలుగు దర్శకులు తీసుకెళ్తున్నారు. మరి అలానే ఇప్పుడు పెద్ది కూడా ఆ రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సో గ్లోబల్ స్టార్ తన మార్కెట్ ని పెంచుకోడానికి ఇది మరో స్టెప్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.