గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను తొలుత సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ‘ఓజి’తో పాటు రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా ఓ ప్రెస్ ఇంటరాక్షన్‌లో బాలకృష్ణ అఖండ 2 చిత్ర రిలీజ్ డిసెంబర్ తొలి వారంలో ఉంటుందని పేర్కొన్నారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.