బాలీవుడ్ బాటలో మీనాక్షి చౌదరి..?

టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ హిట్స్ అందుకుంటున్న యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం హాట్ ఫేవరెట్ బ్యూటీగా మారింది. ఇక ఈమె పట్టిందల్లా హిట్టే అన్న తీరులో చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి గుర్తింపు దక్కించుకుంటోంది. అయితే స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల చిత్రాల్లోనూ అమ్మడు ఛాన్స్‌లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

కాగా, ఇప్పుడు ఈ బ్యూటీ చూపులు బాలీవుడ్‌పై పడినట్లు తెలుస్తోంది. అందరి హీరోయిన్ల మాదిరే ఈ బ్యూటీ కూడా బాలీవుడ్‌లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తోందట. అయితే, బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం హీరోగా తెరకెక్కనున్న ‘ఫోర్స్ 3’ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఈ బ్యూటీకి దక్కినట్లు తెలుస్తోంది. దీనికి మీనాక్షి కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి మీనాక్షి బాలీవుడ్ డ్రీమ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఈ సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version