గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి రూరల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే, ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మేకర్స్ అందించారు. ఈ సినిమా షూటింగ్‌తో పాటు ఎడిటింగ్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం 50 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు, డిఓపి రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి కలిసి దిగిన ఓ ఫోటో నెట్టింట పోస్ట్ చేశారు.
దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.