మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో వస్తున్న శ్రద్ధా శ్రీనాథ్

నటి శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజేష్ ఎం.సెల్వా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సంతోష్ ప్రతాప్, చాందిని, శ్యామ హరిణి, బాలా హసన్, సుభాష్ సెల్వం, వివియా సంత, ధీరజ్, హేమ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 2, 2025 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ కథలో శ్రద్ధా ఒక గేమ్ డెవలపర్ పాత్రలో కనిపించనుంది. ఒక భయానక సంఘటనలో చిక్కుకున్న ఆమె, దాని వెనుక ఉన్న నిజాలను వెలికితీయడానికి డిజిటల్ ప్రపంచంలో అడుగు పెడుతుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే రహస్యాలు, మోసాలు, ఊహించని మలుపులు సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సిరీస్ సాధారణ థ్రిల్లర్ మాత్రమే కాకుండా, నేటి డిజిటల్ యుగంలో మన జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి.. సంబంధాలపై అది చూపే ప్రభావం ఏంటో కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది.

Exit mobile version