ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే భారీ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక అలాగే చాలా కాలం విరామం అనంతరం ఈ చిత్రం మిగిలి ఉన్న షూట్ కాస్తా ఈ నవంబర్ 9 నుంచి మొదలు పెట్టి ఫినిష్ చెయ్యనున్నారు. అయితే చిరు ఈ చిత్రం అనంతరం రెండు రీమేక్ చిత్రాలను చేపట్టిన సంగతి తెలిసిందే.
వాటిలో లూసిఫర్ రీమేక్ ను వివి వినాయక్ తెరకెక్కించనుండగా వేదాళం రీమేక్ ను మెహర్ రమేష్ తెరకెక్కించనున్నారు. అయితే ఈ రెండిట్లో చిరు మొదట వేదాళం రీమేక్ నే చేపట్టనున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుండగా ఈ చిత్రాన్ని అతి త్వరగానే ముగించేయాలని చిరు అనుకుంటున్నారట.
పరిస్థితుల రీత్యా సాధ్యమైనంత వరకు రెండు నెలల్లో లేదా రెండున్నర నెలల్లోనే కంప్లీట్ చెయ్యాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పటికే మెహర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండగా క్యాస్టింగ్ ను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసేసారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి.