సీతమ్మ వాకిట్లో…కి త్వరలోనే మహేష్ డబ్బింగ్

సీతమ్మ వాకిట్లో…కి త్వరలోనే మహేష్ డబ్బింగ్

Published on Nov 26, 2012 11:54 AM IST


టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే డబ్బింగ్ చెప్పనున్నారు. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్స్ ప్రకారం ఈ నెల 30 నుంచి గానీ లేక డిసెంబర్ 1 నుంచి గానీ మహేష్ బాబు డబ్బింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబందించిన మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు అన్నయ్యగా కనిపించనున్న ఈ సినిమాని 2013 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సమంత మరియు అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు