కొత్త లుక్ తో అదరగొడుతున్న మహేష్


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఉన్న యువ హీరోలలో అందం విషయంలో అమ్మాయిల మనసునే అబ్బాయిలు ఈర్ష పడేంత అందగాడు ఎవరయ్యా అంటే మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఆయన ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రతి సినిమాకి జాగ్రత్తలు తీసుకునే మహేష్ ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తరువాత తన బాడీ మీద చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఎందుకంటారా? తన ప్రతి సినిమాలో హీరో పాత్రని చాలా విభిన్నంగా చూపించే సుకుమార్ ఈ సినిమాలో మహేష్ పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేసాడని సమాచారం. దీని గురించి ఎటువంటి సమాచారం బయటకి పోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పాత్ర కోసం మహేష్ ఒక స్పెషల్ ట్రైనర్ ని పెట్టుకున్నాడు. ఆహరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న మహేష్ ఇటీవలే షూటింగ్ స్పాట్లో చుసిన షాక్ అయ్యారట. మహేష్ కొత్త లుక్ అడిరిందని వారు చెబుతున్నారు. ఇటీవలే మహేష్ మీద ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించారు. మహేష్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాల్ని 14 రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Exit mobile version